రాష్ట్రంలో ప్రైవేట్ స్కూల్స్ కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు తీర్చిదిద్దుతున్నామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.హైదరాబాద్ బషీర్ బాగ్ లోని ఆలియా, మహబూబియా పాఠశాలలను..మంత్రులు మహమూద్ అలీ, తలసానితో కలిసి సందర్శించారు. మహబూబియా పాఠశాలలో జరుగుతున్న పనులను పరిశీలించారు. మంత్రుల తో పాటు మన బస్తీ..మన బడి పనులను పరిశీలించారు బీజేపి ఎమ్మెల్యే రాజా సింగ్. ఈ సందర్బంగా మాట్లాడిన సబితి ఇంద్రారెడ్డి.. 1 నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెడుతున్నామని చెప్పారు. రూ.7,300 కోట్లతో పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు తీసుకొస్తున్నామని తెలిపారు. స్కూల్స్ కు రంగులు వేయడమే కాకుండా బిల్డింగ్స్, డిజిటల్ క్లాస్ రూమ్స్, వాటర్, టాయిలెట్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. తల్లిదండ్రులంతా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపాలని కోరారు.