మునుగోడు అభివృద్ధి బాధ్యత తనదని.. టీఆర్ఎస్ను గెలిపించే బాధ్యత ప్రజలదని మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. మునుగోడు మరింత అభివృద్ధి చెందాలంటే టీఆర్ఎస్ను గెలిపించాలని కోరారు. మునుగోడులో ఫ్లోరైడ్ మహమ్మారిని రూపుమాపిన ఘనత కేసీఆర్కే దక్కుందున్నారు. రాజగోపాల్ రెడ్డి తన స్వార్ధం కోసమే రాజీనామా చేశారని ఆరోపించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నామన్నారు.
కేసీఆర్ బీఆర్ఎస్ ప్రకటించగానే బీజేపీలో వణుకు మొదలైందని సబితాఇంద్రారెడ్డి అన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే ప్రతి ఒక్కరికి 15 లక్షలు వేస్తామని చెప్పారని.. ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. మోడీ 2కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి పత్తా లేకుండా పోయారని విమర్శించారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తున్నట్లు తెలిపారు.