
సీఎం కేసీఆర్ నాయకత్వంలో మహేశ్వరం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. కేసీఆర్ తీసుకువచ్చిన ‘మన ఊరు మన బడి’ కార్యక్రమంలో భాగంగా.. దాదాపుగా రూ.4 కోట్ల కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) ఫండ్స్ ద్వారా ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. నిధులు ఇచ్చిన దాతలకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ 28వ డివిజన్లో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ పాఠశాల భవనానికి మంత్రి సబిత శంకుస్థాపన చేశారు.
కురుమల్ గూడలోని 10వ వార్డులో రూ.2కోట్ల 42 లక్షలతో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పారిజాత నరసింహారెడ్డి, స్థానిక కార్పొరేటర్లు, మున్సిపల్ అధికారులు, టీఆర్ఎస్ నాయకులు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.