ఇల్లెందు, వెలుగు : వచ్చే నెల 1న ఇల్లెందులో నిర్వహించే సీఎం కేసీఆర్ "ప్రజా ఆశీర్వాద సభ" ను విజయవంతం చేయాలని గులాబీ శ్రేణులకు మంత్రి సత్యవతి రాథోడ్ పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎంపీ మాలోత్ కవితతో కలిసి శుక్రవారం ఇల్లందులో పర్యటించారు. సభ ఏర్పాట్లపై ఎమ్మెల్యే హరిప్రియ క్యాంపు ఆఫీసులో సమీక్ష నిర్వహించారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ హరిప్రియ భారీ మెజారిటీతో విజయం సాధించడం ఖాయమన్నారు. రేవంత్ రెడ్డి తన పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు. సమావేశంలో లైబ్రరీ చైర్మన్ దిండిగాల రాజేందర్, మున్సిపల్ చైర్మన్వెంకటేశ్వరరావు(డీవీ), వైస్ చైర్మన్ సయ్యద్ జానీ పాషా, ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కల్లూరులో నవంబర్1న
కల్లూరు వెలుగు: నవంబర్ 30న సత్తుపల్లి నియోజకవర్గంలోని కల్లూరు లో జరిగే ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్పాల్గొంటారని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తెలిపారు. కల్లూరు షుగర్ ఫ్యాక్టరీ సమీపంలోని మారుతి నగర్ లో సభ స్థలిని , హెలిప్యాడ్ ను శుక్రవారం ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ అజయ్ కుమార్, పార్టీ మండల అధ్యక్షుడు పాలేపురామారావు, డీసీసీబీ డైరెక్టర్ లక్ష్మణరావు, కార్యకర్తలు పాల్గొన్నారు.