రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఇంట్లో విషాదం నెలకొంది. మంత్రి తండ్రి లింగ్యా నాయక్ అనారోగ్యంతో మృతిచెందారు. ఆయన మరణం పట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. మంత్రి సత్యవతి రాథోడ్‌కు ఫోన్ చేసి సీఎం కేసిఆర్ పరామర్శించారు. లింగ్యా నాయక్ మృతి పట్ల వారి కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారి తండ్రి శ్రీ లింగ్యా నాయక్ మరణం పట్ల ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. మంత్రి సత్యవతి రాథోడ్ ను ఫోన్లో సీఎం పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు
— Telangana CMO (@TelanganaCMO) February 17, 2022
మంత్రి సత్యవతి రాథోడ్ తండ్రి లింగ్యా నాయక్ గురువారం తెల్లవారుజామున కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మహబూబాబాద్ జిల్లా కురవి మండలం పెద్దతండాలోని తన నివాసంలో మృతిచెందారు. ప్రస్తుతం సత్యవతి రాథోడ్ మేడారం సమ్మక్క- సారలమ్మ మహాజాతర పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తండ్రి మరణవార్త తెలిసిన వెంటనే ఆమె హుటాహుటిన పెద్దతండాకు బయలుదేరారు.