మహబూబాబాద్, వెలుగు : రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్శనివారం తన కుడిచేతిపై కేసీఆర్ అని పచ్చబొట్టు వేయించుకున్నారు. శనివారం హైదరాబాద్లో జరిగిన తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గిరిజన సంస్కృతి వేడుకలు నిర్వహించారు. ఇందులో పాల్గొన్న మంత్రి.. పచ్చబొట్టు స్టాల్ కనిపించడంతో ఆసక్తిగా గమనించారు. తనకు సీఎం కేసీఆర్ అని పచ్చబొట్టు వేయాలని కోరగా..కుమ్రం భీం సహచరుడు వెడ్మ రాము కోడలు రాంబాయి మంత్రి కుడిచేతిపై పచ్చబొట్టు వేశారు.