
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన వేడుకల్లో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మానుకోట జిల్లాలో అన్ని రంగాల్లో ముందు నిలుపుతున్నట్లు తెలిపారు.
ప్రభుత్వ మెడికల్ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల, హార్టికల్చర్ డిగ్రీ కాలేజ్ సీఎం కేసీఆర్ సహకారంతో మంజూరు కావడం సంతోషకమన్నారు. కార్యక్రమంలో ఎంపీ కవిత, ఎమ్మెల్యే శంకర్‌నాయక్, జడ్పీ చైర్సర్సన్ బిందు, కలెక్టర్ శశాంక, ఎస్పీ శరత్ చంద్ర పవార్, అడిషన్ కలెక్టర్దేవిడ్ తదితరులు ఉన్నారు.