అభివృద్ధి కోసమే ఆర్థికసాయం: సత్యవతి రాథోడ్‌‌‌‌

ములుగు, వెలుగు : బీసీల అభివృద్ధి కోసమే ఆర్థికసాయం అందజేస్తున్నట్లు గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖా మంత్రి సత్యవతి రాథోడ్‌‌‌‌ చెప్పారు. ములుగు, వెంకటాపూర్‌‌‌‌ మండలాలకు చెందిన పలువురికి మంజూరైన బీసీ ఆర్థికసాయం చెక్కులను ఎంపీ మాలోతు కవిత, జడ్పీ చైర్‌‌‌‌పర్సన్‌‌‌‌ బడే నాగజ్యోతి, రెడ్కో చైర్మన్‌‌‌‌ వై.సతీశ్‌‌‌‌రెడ్డి, కలెక్టర్‌‌‌‌ ఇలా త్రిపాఠి, ఐటీడీఏ పీవో అంకిత్, ఎస్పీ గాష్‌‌‌‌ ఆలంతో కలిసి బుధవారం ములుగు కలెక్టరేట్‌‌‌‌లో పంపిణీ చేశారు. అదేవిధంగా ఇటీవల వరదల్లో కొట్టుకుపోయి మరణించిన ఏటూరునాగారం మండలం కొండాయికి చెందిన వారి ఫ్యామిలీలకు రూ. 5 లక్షల పరిహారానికి సంబంధించిన చెక్కులను అందజేశారు. 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న రూ. లక్ష సాయాన్ని పెట్టుబడిగా ఉపయోగించుకొని, ఆర్థికంగా స్థిరపడాలని సూచించారు. మొదటి విడతలో నియోజకవర్గానికి చెందిన 300ల మందిని ఎంపిక చేసి ఆర్థికసాయం చెక్కులు అందజేశామని, కొత్తగూడెం, గంగారం మండలాలకు చెందిన వారికి త్వరలో పంపిణీ చేస్తామని చెప్పారు. వరదల కారణంగా దెబ్బతిన్న కొండాయి గ్రామస్తులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. అనంతరం కొండాయి, బూర్గుపేట, మల్యాల, దొడ్ల గ్రామాల ప్రజలకు ఇండేన్‌‌‌‌ ఆయిల్‌‌‌‌ తరఫున 19 రకాల సరుకులతో కూడిన కిట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్​ పోరిక గోవింద్‌‌‌‌ నాయక్‌‌‌‌, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు పల్లా బుచ్చయ్య, ఆర్డీవో సత్యపాల్‌‌‌‌రెడ్డి పాల్గొన్నారు.

మానుకోటను ఎడ్యుకేషన్‌‌‌‌ హబ్‌‌‌‌గా మారుస్తాం

మహబూబాబాద్, వెలుగు : మానుకోట జిల్లాను ఎడ్యుకేషన్‌‌‌‌ హబ్‌‌‌‌గా మారుస్తామని మంత్రి సత్యవతి రాథోడ్‌‌‌‌ ప్రకటించారు. బుధవారం జిల్లా కేంద్రంలో బైక్‌‌‌‌ ర్యాలీ నిర్వహించారు. అనంతరం నెహ్రూ సెంటర్‌‌‌‌లో కేసీఆర్‌‌‌‌ కటౌట్‌‌‌‌కు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నూతనంగా ఏర్పాటు చేయనున్న ఇంజినీరింగ్‌‌‌‌ కాలేజీల్లో ఐదు కోర్సుల్లో 60 మంది చొప్పున 300 మందికి అడ్మిషన్‌‌‌‌ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. కొత్తగా ఏర్పాటైన ట్రైబల్ వెల్ఫేర్ గురుకులానికి అనుబంధంగా ఎంబీఏ కోర్సును తీసుకొస్తామని చెప్పారు. హర్టీకల్చర్‌‌‌‌ డిగ్రీ కాలేజీ ఏర్పాటుకు సైతం పర్మిషన్‌‌‌‌ వచ్చిందన్నారు. కార్యక్రమంలో మహబూబాబాద్‌‌‌‌ ఎమ్మెల్యే బానోతు శంకర్‌‌‌‌నాయక్‌‌‌‌, ఎంపీ మాలోతు కవిత, జడ్పీ చైర్‌‌‌‌పర్సన్‌‌‌‌ ఆంగోతు బిందు, మున్సిపల్‌‌‌‌ చైర్మన్‌‌‌‌ పాల్వాయి రామ్మోహన్‌‌‌‌రెడ్డి, వైస్‌‌‌‌చైర్మన్‌‌‌‌ ఫరీద్ పాల్గొన్నారు.