మంత్రి సత్యవతి రాథోడ్కు నిరసన సెగ..

మంత్రి సత్యవతి రాథోడ్కు నిరసన సెగ..

మహబూబాబాద్ జిల్లా గూడూరులో ఏకలవ్య మోడల్ రెసిడెన్సియల్ స్కూల్ నూతన భవన శంకుస్థాపన కార్యక్రమానికి వెళ్లిన మంత్రి సత్యవతి రాథోడ్ కి భూ బాధితుల నుంచి నిరసన సెగ తగిలింది. సాగు భూములను లాక్కొని ఏకలవ్య పాఠశాల నిర్మిస్తున్నారని మంత్రి ఎదుట గిరిజన రైతులు అందోళనకు దిగారు. శంకుస్థాపనను అడ్డుకునే ప్రయత్నం చేశారు. 

Also Read :- రూ.168 కోట్లతో మూసి నది, ఈసా నదులపై ఐదు బ్రిడ్జిలు

తమకు నష్టపరిహారం ఇవ్వాలంటూ.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గిరిజన రైతులు నినాదాలు చేశారు.  దీంతో గిరిజన రైతులును పోలీసులు అడ్డుకున్నారు. నిరసనకారులను పోలీసులు అదుపులోకి  తీసుకోవడంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది.