గిరిజనులమంతా రుణపడి ఉంటాం: మంత్రి సత్యవతి రాథోడ్

గిరిజనులమంతా రుణపడి ఉంటాం: మంత్రి సత్యవతి రాథోడ్

వందేళ్లలో జరగాల్సిన  తెలంగాణ అభివృద్ధి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేవలం తొమ్మిది సంవత్సరాలలోనే జరిగిందని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. పోడు కమిటీకి చైర్మన్ గా ఉండి గిరిజనులకు పట్టాలు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని ఆమె చెప్పారు. రాష్ట్రంలో 3146 తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చినందుకు బీఆర్ఎస్ కు గిరిజనులమంతా రుణపడి ఉంటామన్నారు. గిరిజన బిడ్డల సంక్షేమం కోసం గురుకులాలు, స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాతే జరిగిందని గుర్తు చేశారు. 

రాష్ట్రంలో 4,063,69 ఎకరాల పోడు భూములకు సంబంధించి..,1,51,730 మంది లబ్ధిదారులకు ఒకేసారి పట్టాలు ఇవ్వడమనేది దేశ చరిత్రలో మొదటిసారి అని మంత్రి ప్రశంసించారు. తండాలలో రోడ్ల నిర్మాణం కోసం మరో రూ. 25 కోట్లు  ప్రభుత్వం మంజూరు చేసిందని వెల్లడించారు.