రూ.500 కోట్ల ఆస్తి ఉన్నోళ్లకూ రైతు భరోసా ఇవ్వాలట

రూ.500 కోట్ల ఆస్తి ఉన్నోళ్లకూ రైతు భరోసా ఇవ్వాలట
  • బీఆర్ఎస్ పై మంత్రి సీతక్క ఫైర్ 

కొత్తగూడ, వెలుగు : ‘రూ. 500 కోట్ల ఆస్తి ఉన్నోళ్లకు గత ప్రభుత్వంలో రైతు బంధు ఇచ్చారు.. ఇప్పుడు కూడా ఇవ్వాలని గొడవ చేస్తున్నరు’ అని మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్‌‌‌‌‌‌‌‌ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ ఆధ్వర్యంలో మహబూబాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లా గంగారం మండల కేంద్రంలోని బాలికల ఆశ్రమ స్కూల్‌‌‌‌‌‌‌‌లో ఆదివారం నిర్వహించిన మెగా హెల్త్​క్యాంప్‌‌‌‌‌‌‌‌ను మంత్రి సీతక్క, ఎస్పీ సుధీర్‌‌‌‌‌‌‌‌ రాంనాథ్‌‌‌‌‌‌‌‌ కేకన్‌‌‌‌‌‌‌‌ ప్రారంభించారు. 

ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ ఐదు గుంటలు ఉన్నోళ్లకు రైతు భరోసా ఇద్దామంటే అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం సమాజంలో స్వార్థం పెరిగిపోయిందని, ప్రతీది తనకే కావాలని ఆలోచిస్తున్నారని ఎద్దేవా చేశారు. తల్లిదండ్రులు జన్మనిస్తే.. డాక్టర్లు ఆపద టైంలో పునర్జన్మ ఇస్తామని కొనియాడారు. పోలీసులు సేవాగుణం కలిగి ఉండి ప్రజలకు అన్ని విధాలుగా సాయం అందించాలనిసూచించారు. 

హెల్త్‌‌‌‌‌‌‌‌ క్యాంప్‌‌‌‌‌‌‌‌కు రెండు మండలాల నుంచి సుమారు 3 వేల మంది హాజరయ్యారు. అనంతరం వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌‌‌‌‌‌‌‌వో మురళీధర్, ఐఎంఏ డాక్టర్లు నెహ్రూనాయక్‌‌‌‌‌‌‌‌, జయుడు, డీఎస్పీ తిరుపతిరావు, గూడూరు సీఐ బాబురావు, కొత్తగూడ, గంగారం, గూడూరు ఎస్సైలు కుశకుమార్, రవికుమార్‌‌‌‌‌‌‌‌, గిరిధర్‌‌‌‌‌‌‌‌రెడ్డి పాల్గొన్నారు.