గిరిజనులను రెచ్చగొట్టవద్దు: మంత్రి సీతక్క

గిరిజనులను రెచ్చగొట్టవద్దు: మంత్రి సీతక్క

ఆదిలాబాద్​ జిల్లా ఇంద్రవెల్లి అమరవీరుల సంస్మరణ సభలో మంత్రి సీతక్క పాల్గొన్నారు.  44 సంవత్సరాల క్రితం జరిగిన దురదృష్టకర సంఘటన అమరవీరుల  గుండెల్లో చెరగని ముద్ర వేసింది. అటవీఅధికారులు సంయమనం పాటించాలంటూ.. గిరిజనులను రెచ్చగొట్టే చర్యలను మానుకోవాలని  మంత్రి సీతక్క సూచించారు.   

ఏప్రిల్ 20వ తేదీ రాగానే చాలామంది ఈ సంఘటన గుర్తొచ్చి భయం తో వణికిపోతున్నారు. సీఎం రేవంత్​ రెడ్డి పీసీసీ అధ్యక్షునిగా ఉన్న సమయంలో ఆదిలాబాద్​ లో స్మ్రతివనం ఏర్పాటు చేస్తానన్న హామీని  నెరవేర్చారన్నారు.  గత ప్రభుత్వం అమరవీరులందనికి గుర్తించలేదని.. కాంగ్రెస్​ ప్రభుత్వం అందరిని గుర్తించేందుక ఐటీడీఏ అధికారులతో కమిటి వేస్తామని మంత్రి సీతక్క తెలిపారు. అమరవీరుల కుటుంబాలకు  ఐసీడీఎస్​.. పంచాయితీ రాజ్​ శాఖల్లో ఉద్యోగాలు ఇచ్చి అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు.  ఐటిడిఎలు..   పోడు భూముల చట్టం..పీసా.. ఉపాధి హమీ చట్టం  అమరవీరుల త్యాగాల వల్లనే వచ్చాయన్నారు..

ఆదివాసీల అభివృద్దికి కృషి చేస్తామన్న సీతక్క.. ఏజన్సీ ఏరియాల్లో గిరిజనులకు ఉద్యోగాలిచ్చే అంశాన్ని పరిశీలిస్తామన్నారు.  మహిళలకు వడ్డీలేని రుణాలను మంజూరు చేస్తామని... ఇప్పపువ్వు లడ్డూలతో విద్యార్థులకు ఎనిమియా దూరం అవుతుందన్నారు. సర్వే జరగని భూములకు సర్వే చేసి.. పట్టాలిస్తామన్నారు.