- ఎన్నికల ప్రచారం, వ్యూహాలపై చర్చ!
హైదరాబాద్, వెలుగు: ఉత్తర మహారాష్ట్ర సీనియర్ అబ్జర్వర్ గా నియమితులైన మంత్రి సీతక్క ఆదివారం నాసిక్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, స్థానిక నాయకులు మంత్రి సీతక్కకు ఘన స్వాగతం పలికారు. నాసిక్ జిల్లాలో ఎన్నికల సరళి, పార్టీ ప్రచార శైలిని సీతక్క అడిగితెలుసుకున్నారు.ఎన్నికల్లో గెలిచేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. సోమవారం కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమంలో సీతక్క పాల్గొననున్నారు. రెండు, మూడు రోజులు ఉత్తర మహారాష్ట్ర జిల్లాల్లోనే ఉంటారు. స్థానిక నాయకులను సమన్వయం చేయడంతోపాటు ఎన్నికల తీరు, అభ్యర్థుల ప్రచారాన్ని పర్యవేక్షించనున్నారు.