ఎడ్యుకేషన్‌కు సహకరించాలి .. కంపెనీలకు మంత్రి సీతక్క సూచన

ఎడ్యుకేషన్‌కు సహకరించాలి .. కంపెనీలకు మంత్రి సీతక్క సూచన

హైదరాబాద్​, వెలుగు: గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ నాణ్యమైన విద్య అందరికీ అందుబాటులో లేదని, ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం, కార్పొరేట్లు,  స్వచ్ఛంద సంస్థలు సహకారం అందించాలని రాష్ట్ర పంచాయతీరాజ్,  గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా  స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి డాక్టర్ డి. అనసూయ సీతక్క అన్నారు. 

హైదరాబాద్ సాఫ్ట్‌‌వేర్ ఎంటర్‌‌ప్రైజెస్ అసోసియేషన్ (హైసియా)  ఎడ్యుకేషన్ కాన్​క్లేవ్​2024ను “లెవరేజింగ్ టెక్నాలజీ టు డెమోక్రటైజ్ ఎడ్యుకేషన్” అనే పేరుతో హైదరాబాద్​లో నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ గిరిజన,  గ్రామీణ ప్రాంతాలలో విద్య అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని, పెట్టుబడులు పెట్టాలని ఆమె పిలుపునిచ్చారు. నాణ్యమైన డిజిటల్ విద్యను అందించాలనే లక్ష్యంతో గిరిజన  గ్రామీణ గ్రామాలను దత్తత తీసుకోవాలని కార్పొరేట్లకు విజ్ఞప్తి చేశారు.