కాంగ్రెస్​ మండల ఇన్​చార్జీల ఎన్నిక

  •    ప్రకటించిన మంత్రి సీతక్క

ములుగు, వెలుగు : ఎంపీ ఎన్నికల నేపథ్యంలో ములుగు నియోజకవర్గంలోని 9 మండలాల ఇన్​చార్జీలను మంత్రి సీతక్క ఆదివారం ప్రకటించారు. ములుగు మండల ఇన్​చార్జీలుగా మల్లాడి రాంరెడ్డి, బానోత్ రవిచందర్, బొక్క సత్తిరెడ్డి, వెంకటాపూర్ రాజేందర్ గౌడ్, ముషిన పెళ్లి కుమార్ గౌడ్, గోవిందరావుపేటకు బై రెడ్డి భగవాన్ రెడ్డి, కల్యాణి, తాడ్వాయికి శ్రీనివాస్ రెడ్డి, ఏటూరు నాగారం సోమయ్య, ఎండీ.

ఆయుబ్​ఖాన్, కన్నయి గూడెం దేవేందర్, జగన్మోహన్ రెడ్డి, మంగపేట వెంకన్న, సురేందర్ బాబు, కొత్త గూడ నారాయణ రెడ్డి, లావణ్య వెంకన్న, గంగారాం మండలానికి సుంకర బోయిన మొగిలిని నియమించారు. కాంగ్రెస్ మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ గెలుపు కోసం కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు.