
కొత్తగూడ, వెలుగు: పార్టీలో కష్టపడ్డవారికే పదవులు వరిస్తాయని మంత్రి సీతక్క అన్నారు. శనివారం మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నిర్మాణానికి మంత్రి భూమి పూజ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యకర్తల మీటింగ్లో మాట్లాడుతూ కొత్తగూడ, గంగారం మండలాలకు అధిక నిధులు కేటాయించి, అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ మండలాధ్యక్షుడిగా సుంకరబోయిన మొగిలి, ఉపాధ్యక్షుడిగా కర్ర జనార్దర్రెడ్డితోపాటు 19 మందితో కొత్త కమిటీని ఎన్నుకున్నారు. కార్యక్రమంలో కొత్తగూడ, గంగారం మండలాల పార్టీ అధ్యక్షులు వజ్జ సారయ్య, జాడీ వెంకటేశ్వర్లు, మాజీ ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు.