సమానత్వం అందుకున్న రోజే మహిళల రోజు : మంత్రి సీతక్క

సమానత్వం అందుకున్న రోజే మహిళల రోజు : మంత్రి సీతక్క
  • ట్యాంక్​బండ్​పై మహిళా దినోత్సవంలో మంత్రి సీతక్క

ట్యాంక్​బండ్, వెలుగు: సమాజంలో మహిళ లు సమానత్వం అందుకున్న రోజే మహిళల రోజు అవుతుందని మంత్రి సీతక్క అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఒబెస్ట ట్రిక్స్ అండ్​ గైనకాలాజికల్ సొసైటీ ఆఫ్ హైదరాబాద్, ధీర స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో శనివారం ఉదయం ట్యాంక్ బండ్ హెచ్ఎండీఏ గ్రౌండ్​లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. మంత్రితో పాటు ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా హెచ్ఎండీఏ మైదానం నుంచి ఎన్టీఆర్ మార్గ్ వరకు నిర్వహించిన వాకథాన్​ను జెండా ఊపి మంత్రి సీతక్క ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడారు. మహిళలు ఆయా రంగాల్లో ఎంత కష్టపడ్డా గుర్తింపు రావడం లేదనిన్నారు. ప్రతి మహిళ చురుగ్గా ముందుకు వెళ్లి అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని కోరారు.

మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేందుకు.. రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెడు తోందని.. వాటిని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు. ఈ కార్యక్రమంలో డీసీపీ శిల్పవల్లి, సురేందర్ రావు, శాంత కుమారి, మంజుల రావు తదితరులు పాల్గొన్నారు.