హైదరాబాద్, వెలుగు: ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాలన కొనసాగుతోందని మంత్రి సీతక్క అన్నారు. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ఆదేశానుసారం ప్రజలకిచ్చిన హామీలను నిలబెట్టుకుంటున్నామని చెప్పారు. సోమవారం ప్రజాభవన్లో సీతక్క ఆధ్వర్యంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. తెలంగాణ బిడ్డలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న తల్లి సోనియా గాంధీ అని పేర్కొన్నారు.
‘‘నిరుద్యోగులకు ఉద్యోగాలిచ్చాం. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్లు ఇచ్చాం. రైతులను రుణ విముక్తులను చేశాం”అని వివరించారు. కాగా, యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ప్రశాంత్ మంత్రి సీతక్క జీవిత నేపథ్యంలో ‘మలినం లేని మట్టి కథ’ గీతాన్ని రూపొందించగా ప్రజాభవన్లో ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గీతాన్ని రూపొందించిన ప్రశాంత్, ఇతర సభ్యులను అభినందించారు.