తెలంగాణ లో కాంగ్రెస్ 14 సీట్లు గెలుస్తుందన్నారు మంత్రి సీతక్క. 15వ సీటు అనేది తమకు బోనస్ అనిచెప్పారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో ఎన్నికల ప్రచారం చేసిన ఆమె.. దేశంలో బడుగు బలహీన వర్గాలు బాగుపడాలంటే రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి కావాలన్నారు. మోదీలా ఏ ప్రధాని కూడా దేశంలో హిందు ముస్లిం మధ్య వైషమ్యాలు పెంచలేదన్నారు. రాజ్యాంగాన్ని మార్చేందుకే బీజేపీ 400 సీట్లు కావాలంటుందన్నారు. బీజేపీ ప్రభుత్వం జీఎస్టీతో పేదల నడ్డి విరిచిందని విమర్శించారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారెంటీ లను ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పారు సీతక్క . ఎన్నికల కోడ్ వల్ల కొన్ని పథకాలు ప్రారంభం కాలేదన్నారు. ఇప్పటికే ఫీ బస్ ఫ్రీ, కంరెంట్, 500 గ్యాస్, ఇందిరమ్మ ఇండ్లు వంటి పథకాలను ప్రారంభించామన్నారు. 10 సంవత్సరాలలో ఇచ్చిన హామీలను నెరవేర్చని బీఆర్ఎస్ కు.. వంద రోజుల్లో తాము ఇచ్చిన హామీల అమలు గురించి అడగడం సిగ్గుచేటన్నారు. బీజేపీ, బీఅర్ఎస్ పార్టీలు చెప్పే మాయ మాటలు నమ్మొద్దని సూచించారు సీతక్క. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలరాం నాయక్ ను గెలిపించాలని కోరారు.