
తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది.. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యుల మధ్య మాటల యుద్ధం పీక్స్ కి చేరింది. స్పీకర్ అధికారాలు, సభ్యుల హక్కులు ఏంటో తేల్చాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పట్టుబట్టడంతో సభలో గందరగోళం నెలకొంది.జగదీశ్ రెడ్డి దళిత స్పీకర్ పట్ల గౌరవం లేకుండా వ్యవహరిస్తున్నారంటూ కాంగ్రెస్ సభ్యులు మండిపడ్డారు. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు మంత్రి సీతక్క. బీఆర్ఎస్ నాయకులకు అహంకారం ఇంకా తగ్గలేదని.. దళిత స్పీకర్ పై గౌరవం లేదని మండిపడ్డారు.
దళిత స్పీకర్ కాబట్టే నువ్వు అంటూ ఏకవచనంతో సంబోధిస్తున్నారని... గతంలో గవర్నర్ నరసింహన్ ఉన్నప్పుడు ఆయన కాళ్ళు మొక్కేవాళ్ళని అన్నారు. బీఆర్ఎస్ నాయకులకు మహిళా గవర్నర్ అంటే గౌరవం లేదని.. ఆదివాసీ రాష్ట్రపతి అంటే గౌరవం లేదని అన్నారు సీతక్క. బీఆర్ఎస్ నాయకుల అహంకారం ఇంకా తగ్గడం లేదని ఫైర్ అయ్యారు మంత్రి సీతక్క.
ALSO READ : సభా సమరం..అసెంబ్లీలో మంత్రి కోమటి రెడ్డి వర్సెస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి
ఈ క్రమంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ సభ్యుల మధ్య మాటల పీక్స్ కి చేరడంతో సభను 15నిమిషాల పాటు వాయిదా వేశారు స్పీకర్. దళిత స్పీకర్ పై గౌరవం లేకుండా మాట్లాడిన జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేయాని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నాయకులు.