
హైదరాబాద్, వెలుగు: పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. బుధవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రజా భవన్ లో ఆమె మొక్కలను నాటారు. జీవించడానికి పర్యావరణం చాలా ముఖ్యమైనదని చెప్పారు. వాతావరణం బాగుండాలంటే చెట్లు నాటాలని సూచించారు.
గ్లోబల్ వార్మింగ్ ప్రభావాలను నివారించడానికి చర్యలు చేపట్టాలన్నారు. మొక్కలు నాటుతూ పర్యావరణంలో భాగస్వాములు కావాలని కోరారు. భవిష్యత్తు తరాలకు మంచి వాతావరణం అందించడం మన కర్తవ్యమని గుర్తుచేశారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు మొక్కలునాటి పాఠశాల వాతావరణంలో పచ్చదనాన్ని నెలకొల్పాలని సీతక్క విజ్ఞప్తి చేశారు.