కీసర, వెలుగు: మహిళల్లో చైతన్యం తీసుకొచ్చేందుకే ఇందిరా ఫెలోషిప్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసర మండలం రాంపల్లి దాయార గ్రామంలోని బాలవికాస్ కేంద్రాన్ని బుధవారం రాత్రి మంత్రి విజిట్ చేశారు.
ఇందిరా ఫెలో షిప్ ద్వారా మహిళల్లో చైతన్యం నింపడమే లక్ష్యమన్నారు. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తామన్నారు. వరంగల్ మేయర్ గుండు సుధారాణి, ఆదిలాబాద్ ఎంపీ కంటెస్టెడ్ అభ్యర్థి సుగుణ పాల్గొన్నారు.