![ఎన్నికలు ఎప్పుడొచ్చినా కార్యకర్తలు సిద్ధంగా ఉండాలి: మంత్రి సీతక్క](https://static.v6velugu.com/uploads/2025/02/minister-seethakka-comments-on-local-body-elections_gGmlYJ2675.jpg)
ములుగు జిల్లా గోవిందరావుపేటలో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ కార్యకర్తలు సమయత్తాం కావాలని.. ఎన్నికలు ఎప్పుడు వచ్చిన కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అందించిన సంక్షేమపథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు సీతక్క. నాయకులు కార్యకర్తల మధ్య విభేదాలుంటే తన దృష్టికి తీసుకురావాలని కోరారు.
ఎవరైనా పార్టీ లైన్ దాటితే క్రమశిక్షణ చర్యలు ఉంటాయని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో చేస్తున్న తప్పుడు ప్రచారాలను వెంటనే ఖండించాలని అన్నారు మంత్రి సీతక్క. కాగా.. స్థానిక సంస్థల ఎన్నికలకు సర్కారు సిద్ధమైంది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి.. ప్రకటన ఎప్పుడు వచ్చినా ఎన్నికలకు రెడీగా ఉండాలని ఆదేశించారు.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 1.99 కోట్ల మంది గ్రామీణ ఓటర్లు ఉన్నారు. 12,845 గ్రామ పంచాయతీలు, 1,13,328 వార్డులకు ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మైసూరు పేయింట్స్ అండ్ వార్నిష్కు చెందిన కంపెనీ నుంచి ప్రభుత్వం బ్యాలెట్‌కు అవసరమైన పేపర్‌ను ఆర్డర్ ఇచ్చి రాష్ట్రానికి తెచ్చింది. బ్యాలెట్ పేపర్ల ముద్రణ కూడా పూర్తయింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపుగా 58 వేలకు పైగా పోలింగ్ బాక్స్‌లను అందుబాటులోకి తేగా.. అదనంగా కర్నాటక, ఏపీ నుంచి 18 వేల బాక్సులు తెప్పించారు.