ఎర్రచందనం స్మగ్లర్కు నేషనల్ అవార్డా.?.. పోలీస్ విలనా : మంత్రి సీతక్క

ఎర్రచందనం స్మగ్లర్కు నేషనల్ అవార్డా.?.. పోలీస్ విలనా : మంత్రి సీతక్క

సినిమాలపై మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు.  జై బీమ్ లాంటి సందేశాత్మక సినిమాలకు అవార్డులు రాలేదు.. అలాంటి సినిమాలకు ప్రోత్సాహాలు ఇవ్వలేదు  కానీ..  పోలీస్ బట్టలిప్పి నిలబెట్టే సినిమాలకు అవార్డులు ఇస్తున్నారని విమర్శించారు. చంకలో బిడ్డపెట్టుకుని ఉన్న మహిళ హక్కుల కోసం పోరాడిన సినిమాలు అవార్డు రాలేదు.. స్మగ్లర్ పాత్ర చేసే సినిమాలకు అవార్డులు వస్తున్నాయన్నారు. 

వరంగల్ లో క్రిస్మస్   వేడుకల్లో  పాల్గొన్నారు సీతక్క. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె...  స్మగ్లర్ హీరో..  స్మగ్లింగ్ కట్టడి చేసే పోలీస్ విలన్ ఎలా అవుతారు.? ఇవేం సినిమాలంటూ మండిపడ్డారు.  ఇలాంటి సినిమాలు నేరప్రవృత్తిని పెంచేలా ఉన్నాయన్నారకు.  మానవతా దృక్పథం ఉన్న సినిమాలు రావాలని చెప్పారు సీతక్క

Also Read :- పీవీ తెలంగాణలో పుట్టడం మన అదృష్టం

కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సినిమాలకు ప్రోత్సాహం అందిస్తుందో అలాచించాలన్నారు సీతక్క.   సినిమాలను గౌరవిస్తామన్నారు.  హక్కులు కాపాడే లాయర్ జీరో... స్మగ్లింగ్ చేసే సినిమాలు  హీరో ఎలా అవుతారని ప్రశ్నించారు . సందేశాత్మక సినిమా లు రావాలన్నారు సీతక్క.