స్త్రీనిధి ఎండీపై మంత్రి సీతక్కకు ఫిర్యాదు

స్త్రీనిధి ఎండీపై మంత్రి  సీతక్కకు ఫిర్యాదు

హైదరాబాద్, వెలుగు: స్త్రీనిధి ఎండీ విద్యాసాగర్ రెడ్డిపై ప్రభుత్వానికి ఫిర్యాదులు పెరుగుతున్నాయి. స్త్రీనిధిలో గత పదేండ్లలో తొలగింపునకు గురైన బాధితులు మంగళవారం ఎంపీ బలరాం నాయక్ ఆధ్వర్యంలో మంత్రి సీతక్కను కలిశారు. గత ప్రభుత్వం పలు కారణాలు చూపి ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉద్యోగులను తొలగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. తొలగింపునకు గురైన ఉద్యోగుల లిస్టును మంత్రికి అందజేశారు. దీనిపై స్పందించిన మంత్రి.. ఆ లిస్ట్ ను ఎండీకి పంపించి, వారిని ఎందుకు తొలగించారో రిపోర్టు ఇవ్వాలని ఆదేశించారు.

 కాగా, స్త్రీనిధి సహకార సమాఖ్యలో ఉద్యోగులు  ఎదుర్కొంటున్న సమస్యలపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న స్పందించారు. ఆయన మంగళవారం ఎండీ విద్యాసాగర్ రెడ్డితో భేటీ అయ్యారు. ఉద్యోగుల బదిలీలు, తొలగింపు, నియామకాలు, ప్రమోషన్లలో రూల్ ఆఫ్ రిజర్వేషన్, రోస్టర్ పాయింట్లకు సంబంధించి రికార్డులు తనిఖీ చేశారు.