మంత్రి సీతక్క ఫ్లెక్సీకి క్షీరాభిషేకం

మంత్రి సీతక్క ఫ్లెక్సీకి క్షీరాభిషేకం

కొత్తగూడ, వెలుగు : మహబూబాబాద్​జిల్లా కొత్తగూడకు 30 పడకల ఆస్పత్రిని మంజూరు చేయడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. మంత్రి సీతక్క చొరవతోనే ఆస్పత్రి మంజూరైందని ఆదివారం కొత్తగూడలో కొత్తగూడ, గంగారం మండలాల కాంగ్రెస్​లీడర్లు సీఎం రేవంత్​రెడ్డి, మంత్రులు సీతక్క, దామోదర రాజనర్సింహ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. 

ఈ సందర్భంగా వారు పార్టీ మండలాధ్యక్షుడు అధ్యక్షుడు వజ్జ సారయ్య మాట్లాడుతూ 30 పడకల ఆస్పత్రి మంజూరు చేసినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో రెండు మండలాల మాజీ ఎంపీపీలు విజయారూప్​సింగ్, సరోజన, మాజీ జడ్పీటీసీలు పుష్పలత, రమ, గంగారం మండలాధ్యక్షుడు జాడి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.