తెలంగాణ అసెంబ్లీలో ఆసక్తికర చర్చ జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. మహిళలకు ఫ్రీ బస్సు జర్నీ ఇవ్వటం వల్ల.. ఆటో డ్రైవర్లు ఇబ్బంది పడుతున్నారంటూ ప్రస్తావించారు.. ఈ వ్యాఖ్యలపై మంత్రి సీతక్క స్పందించారు.
పేద మహిళలు ప్రయాణించేది ఆర్టీసీ బస్సుల్లోనే అని.. అలాంటి పేద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితం ప్రయాణం కల్పిస్తే.. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎందుకు ఏడుస్తున్నారని ప్రశ్నించారామె. మహిళలకు ఫ్రీ బస్సు ఉండాలా.. వద్దా అనే విషయంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క్లారిటీ ఇవ్వాలని.. పేద మహిళలకు ఎందుకు ఫ్రీ బస్సు జర్నీ వద్దని ఎందుకు అంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రి సీతక్క.
Also Read:Telangana Assemlby: గవర్నర్ ప్రసంగంలో 30 మోసాలు..60 అబద్ధాలు: పల్లా రాజేశ్వర్ రెడ్డి
ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచి.. ప్రయాణికులపై భారం వేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు మంత్రి సీతక్క. రైతు బందు పేరుతో ధనవంతులకు డబ్బులు వేసిన చరిత్ర మీదని.. పేద మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి అన్నారు. పేదలకు ఉచిత ప్రయాణం వద్దని బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీలో డిమాండ్ చేయటం ఏంటని నిలదీశారు మంత్రి సీతక్క..