
హైదరాబాద్, వెలుగు: ఢిల్లీకి మూటలు మోసే బడ్జెట్ అని బీఆర్ఎస్ నేత కేటీఆర్ వ్యాఖ్యలు చేయడం ఆయన మానసిక పరిస్థితికి అద్దం పడుతుందని మంత్రి సీతక్క తెలిపారు. ఇతర రాష్ట్రాలకు మూటలు మోసింది కేటీఆరే అని ఎద్దేవా చేశారు. కేసీఆర్ మూటలు తీసుకున్నవారంతా ఆగమయ్యారని చెప్పారు. అప్పుల గురించి కేటీఆర్ మాట్లాడటం మిలినీయం జోక్ అని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని మోయలేనంత అప్పుల కుప్పగా మార్చింది బీఆర్ఎస్సేనని విమర్శించారు.
‘‘బీఆర్ఎస్ బడ్జెట్ అంతా కోతల బడ్జెట్.. అందుకే ప్రజలు వాతలు పెట్టారు. మాది మహిళ, రైతు, యువత, అట్టడుగు వర్గాల బడ్జెట్” అని మంత్రి పేర్కొన్నారు. గుంట భూమి లేని ఉపాధి కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద రూ.600 కోట్లు కేటాయించామని వెల్లడించారు.