కులగణనకు జనం జై కొట్టారు.. ప్రతిపక్షాలు ఓర్వలేక విమర్శలు చేస్తున్నరు: మంత్రి సీతక్క

కులగణనకు జనం జై కొట్టారు.. ప్రతిపక్షాలు ఓర్వలేక విమర్శలు చేస్తున్నరు: మంత్రి సీతక్క

కులగణనపై విపక్షాలకు మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు.  కులగణనపై విపక్షాలది తప్పుడు ప్రచారం అని అన్నారు. కులగణనపై ప్రజల స్పందన  చూసి   ఓర్వలేకనే విమర్శలు చేస్తున్నారని  సీతక్క విమర్శించారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం గత సమగ్ర కుటుంబ సర్వే సరిగా చేయలేదన్నారు. కులగణనను కాంగ్రెస్ పార్టీ పకడ్భందీగా చేసిందన్నారు.కులగణనపై బీఆర్ఎస్కు మాట్లాడే హక్కు లేదన్నారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదన్నారు.  కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక 20 వేల కోట్ల రుణమాఫీ చేశామన్నారు. 

Also Read : తెలంగాణ ఆశించిన కేటాయింపులేవి?

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకం చేసిన కులగణన తీర్మానాన్ని  ఫిబ్రవరి4న అసెంబ్లీలో ప్రవేశ పెట్టింది. అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అసెంబ్లీలో చర్చ సందర్భంగా..బీసీల సంఖ్యను కులగణనలో తక్కువ చేసి చూపించారని ప్రతిపక్షాలు విమర్శించాయి.