అమిత్ షా క్షమాపణ చెప్పాల్సిందే :మంత్రి సీతక్క

అమిత్ షా క్షమాపణ చెప్పాల్సిందే :మంత్రి సీతక్క
  • అంబేద్కర్ పేరు తలచడాన్ని తప్పుపడ్తరా?: మంత్రి సీతక్క

హైదరాబాద్, వెలుగు: అంబేద్కర్ పేరు తలచడాన్ని అమిత్ షా తప్పుపట్టడం అంటే అంబేద్కర్ ను అవమానించడమేనని మంత్రి సీతక్క పేర్కొన్నారు. గురువారం ఆమె హైదరాబాద్​లో మీడియాతో మాట్లాడారు. దేశ ప్రజలకు అమిత్ షా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అట్టడుగువర్గాల దేవుడు అంబేద్కర్ అని పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని తొలగించాలనే బీజేపీ కుట్ర బయటపడుతున్నదని, మనుధర్మశాస్ట్రాన్ని ఆ పార్టీ పాటిస్తున్నదని దుయ్యబట్టారు.

దేశంలో అదానీ, మోడీ, బీజేపీ మాత్రమే ఉండాలని ఆ పార్టీ పెద్దలు చూస్తున్నారని విమర్శించారు. ప్రతి పౌరుడి సమానత్వం కోసం రాహుల్ గాంధీ పోరాడుతున్నారని చెప్పారు. అంబేద్కర్ పేరు లేకుండాచేసే కుట్ర జరుగుతున్నదని ఆరోపించారు.