ఆదివాసీ పూజారులతో మంత్రి సీతక్క చర్చలు సఫలం

 ఆదివాసీ పూజారులతో మంత్రి సీతక్క చర్చలు సఫలం

ములుగు జిల్లా మేడారంలో ఆదివాసీ పూజారులతో మంత్రి సీతక్క చర్చలు సఫలమయ్యాయి. నిరసన దీక్షలు విరమించారు సమ్మక్క సారలమ్మ పూజారులు. మేడారంలో పూజారులు తమ సమస్యల పరిష్కరానికి చేపట్టిన ధర్నా శిబిరాన్ని సందర్శించారు సీతక్క. సమ్మక్క, సామలమ్మ పూజారులతో వారి సమస్యలపై చర్చించారు మంత్రి. పూజారుల సమస్యలపై త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు సీతక్క. మంత్రి హామీతో నిరసన విరమించుకున్నారు ఆదివాసీ పూజారులు.

Also read : అర్థరాత్రి ఆలయంలో చోరీ.. హుండీ పగలగొట్టి డబ్బులు ఎత్తుకెళ్లిన దొంగ