గిరిజన భవన్​లో దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ

గిరిజన భవన్​లో దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ

ఏటూరునాగారం, వెలుగు: ములుగు జిల్లా కేంద్రంలోని గిరిజన భవన్​లో ఆదివారం మంత్రి సీతక్క దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ చేశారు. జిల్లా సంక్షేమ అధికారిణి శిరీష అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రి కలెక్టర్​ దివాకరతో కలిసి దివ్యాంగులకు వివిధ రకాల సహాయ ఉపకరణాలు అందించారు. అనంతరం దివ్యాంగులతో కలసి మధ్యాహ్నం భోజనం చేశారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, ములుగు డీఎస్పీ రవీందర్, అలింకో సంస్థ ప్రతినిధి సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

విజేతలకు సత్కారం

గ్రేటర్​ వరంగల్, వెలుగు: నేషనల్ వీల్ చైర్ క్రికెట్ దివ్యాంగులను ఆదివారం సిటీలోని పుప్పాలగుట్టలోని నవ రాష్ట్ర వికలాంగుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ అజీమ్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కారించారు. ఇటీవల జరిగిన నేషనల్ వీల్ చైర్ క్రికెట్ దివ్యాంగుల క్రీడల్లో మహారాష్ట్ర, తెలంగాణల మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్​లో తెలంగాణకు చెందిన దివ్యాంగ క్రికెట్ టీం విజయం సాధించినట్లు ఆయన తెలిపారు.