మహాశివరాత్రి వేడుకలను సక్సెస్​ చేయాలి : ​ మంత్రి సీతక్క

మహాశివరాత్రి వేడుకలను సక్సెస్​ చేయాలి : ​ మంత్రి సీతక్క

వెంకటాపూర్ (రామప్ప), వెలుగు : మహాశివరాత్రి వేడుకలను సక్సెస్​ చేయాలని పంచాయతీరాజ్​ శాఖ మంత్రి సీతక్క అధికారులకు సూచించారు. ఆదివారం మంత్రి రామప్ప  టెంపుల్ రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అంతకుముందు అర్చకులు ఆమెకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి, ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వదించారు.

అనంతరం మంత్రి మాట్లాడుతూ ఈనెల 26  నుంచి 28 వరకు నిర్వహించే మహాశివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించి, అధికారులతో చర్చించారు. శివరాత్రి ఉత్సవాలకు వచ్చే భక్తుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు.  త్వరలో కాకతీయ కాటేజెస్, స్టార్ హోటల్స్, టూరిజం బోట్లు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.

కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు అశోక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవి చందర్, కాంగ్రెస్ నాయకులు,  కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా, రామప్ప పరిరక్షణ కమిటీ కన్వీనర్ అక్కిరెడ్డి రామ్మోహన్​రావు మంత్రి సీతక్కని కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఎండోమెంట్, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ల మధ్య సమన్వయం ఏర్పరిచి వారితో మాట్లాడి పెద్ద ఈవెంట్లు ఈ ప్రాంతానికి వచ్చేలా చూడాలని కోరారు.