బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విధ్వంసం రాజకీయాలకు పాల్పడుతున్నారని మంత్రి సీతక్క మండిపడ్డారు. కేటీఆర్ అధికారం లేకుండా ఉండలేకపోతున్నారని, ఆయనకు మైండ్ పనిచేయడం లేదన్నారు. 2024 జనవరి 25వ తేదీ ఉదయం వేములవాడ రాజన్నను మంత్రి సీతక్క దర్శించుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.
కేటీఆర్ బుద్ధిగా ప్రతిపక్ష హోదాలో పనిచేయాలని.. లేకపోతే వారిని ఎప్పటికీ ప్రజలు తిరస్కరిస్తూనే ఉంటారని సీతక్క సూచించారు. -- సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం చేస్తే ప్రజలు అన్ని గమనిస్తారని చెప్పారు. --సర్పంచుల బిల్లులు పెండింగ్ లో పెట్టింది ఎవరు గత ప్రభుత్వం కాదా అని సీతక్క ప్రశ్నించారు. తాము సక్రమంగా పని చేస్తేనే ప్రజలు తమకు మరోసారి అధికారం ఇస్తారని చేయకపోతే అవకాశం ఇవ్వరన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి ఆహంకారమే కారణమని మంత్రి సీతక్క విమర్శించారు. కేసీఆర్ ఎమ్మెల్యేగా గెలిచిన ఇప్పటివరకు ప్రమాణ స్వీకరం చేయడం లేదన్నారు. ప్రజలు తమ వైపే ఉన్నారని చెప్పిన సీతక్క... మహిళలకు ఉచిత బస్సు ఏర్పాటు చేస్తే బీఆర్ఎస్ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పారు. కేటీఆర్ కు నీచపు కుళ్ళు రాజకీయాలు ఎందుకని ప్రశ్నించారు.
వేములవాడ రాజన్న తమ ఇలా వేల్పు అని చెప్పారు సీతక్క...కుటుంబ సమేతంగా వచ్చి దర్శనం చేసుకుంటామన్నారు. సమ్మక్కను దర్శించుకునే ముందు రాజన్నను దర్శించుకోవడం ఆనవాయితీ అని చెప్పారు. బీఅర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాజన్న ఆలయం అభివృద్ధి వివక్షకు గురైందని ఆరోపించారు. తమ ప్రభుత్వంలో ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని సీతక్క హామీ ఇచ్చారు.