ఐదేండ్లలో మీరు చేయలేని రుణమాఫీ..27 రోజుల్లో చేసి చూపించాం

ఐదేండ్లలో మీరు చేయలేని రుణమాఫీ..27 రోజుల్లో చేసి చూపించాం
  •     మాఫీపై హ‌‌‌‌‌‌‌‌రీశ్‌‌‌‌‌‌‌‌ రావుది గురువింద నీతి : మంత్రి సీతక్క
  •     అర్హులైన రైతులకు రుణమాఫీ చేస్తామని వెల్లడి

హైదరాబాద్, వెలుగు : రుణామాఫీపై మాజీ మంత్రి హ‌‌‌‌‌‌‌‌రీశ్‌‌‌‌‌‌‌‌ రావు గురువింద‌‌‌‌‌‌‌‌ క‌‌‌‌‌‌‌‌థ‌‌‌‌‌‌‌‌లు చెబుతున్నారని మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ హయాంలో అర్హులైన రైతులంద‌‌‌‌‌‌‌‌రికీ రుణమాఫీ చేసినట్లు, కాంగ్రెస్ ప‌‌‌‌‌‌‌‌ది నెల‌‌‌‌‌‌‌‌ల కాలంలో రుణమాఫీని ప‌‌‌‌‌‌‌‌ట్టించుకోన‌‌‌‌‌‌‌‌ట్లు అవాస్తవాలు చెబుతూ గురువింద త‌‌‌‌‌‌‌‌న న‌‌‌‌‌‌‌‌లుపెర‌‌‌‌‌‌‌‌గ‌‌‌‌‌‌‌‌దన్న సామెతను గుర్తు చేస్తున్నారని బుధవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. తొమ్మిదిన్నరేండ్ల బీఆర్ఎస్ హ‌‌‌‌‌‌‌‌యాంలో పంట రుణమాఫీని అబాసుపాలు చేశారని విమర్శించారు. 2018 నుంచి 2023 వ‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌కు ఐదేండ్లలో ల‌‌‌‌‌‌‌‌క్ష లోపు పంట రుణాలకు ఆర్థిక మంత్రిగా వెల‌‌‌‌‌‌‌‌గ‌‌‌‌‌‌‌‌బెట్టిన హరీశ్‌‌‌‌‌‌‌‌ రావు ఐదు విడ‌‌‌‌‌‌‌‌త‌‌‌‌‌‌‌‌ల్లో అర‌‌‌‌‌‌‌‌కొర‌‌‌‌‌‌‌‌గా నిధులు విడుదల చేశారన్నారు. 

మీ లెక్కల ప్రకారమే 21.35 ల‌‌‌‌‌‌‌‌క్షల మంది రైతుల‌‌‌‌‌‌‌‌కు రుణ మాఫీ కోసం రూ.11,910 కోట్లు ఖర్చు చేశారని, అది కూడా విడ‌‌‌‌‌‌‌‌త‌‌‌‌‌‌‌‌ల వారీగా చెల్లించ‌‌‌‌‌‌‌‌డంతో వడ్డీకే సరిపోయిందన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఒకే పంట కాలంలో రూ.18 వేల కోట్ల రుణాల‌‌‌‌‌‌‌‌ను ఏకకాలంలో మాఫీ చేసి, 23 లక్షల మంది రైతులను రుణ విముక్తులను చేసిందన్నారు. బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ ఐదేండ్లలో చేయ‌‌‌‌‌‌‌‌లేని ప‌‌‌‌‌‌‌‌నిని, కేవ‌‌‌‌‌‌‌‌లం తాము 27 రోజుల్లోనే చేసి చూపించామని, రైతుల ప‌‌‌‌‌‌‌‌ట్ల తమకున్న క‌‌‌‌‌‌‌‌మిట్మెంట్‌‌‌‌‌‌‌‌కు ఇది నిదర్శనమన్నారు.  

బోనస్‌‌‌‌‌‌‌‌పై బోగస్ మాటలు..

హుజురాబాద్ ఉప ఎన్నిక‌‌‌‌‌‌‌‌ల టైమ్‌‌‌‌‌‌‌‌లో నాటి సీఎం కేసీఆర్ స‌‌‌‌‌‌‌‌న్న వ‌‌‌‌‌‌‌‌డ్లకు క‌‌‌‌‌‌‌‌నీస మ‌‌‌‌‌‌‌‌ద్దతు ధర మీద బోన‌‌‌‌‌‌‌‌స్ ఇస్తామని హామీ ఇచ్చారని, ఆ త‌‌‌‌‌‌‌‌ర్వాత రెండేళ్లు అధికారంలో ఉన్నా.. స‌‌‌‌‌‌‌‌న్న వడ్లకు నయాపైసా బోన‌‌‌‌‌‌‌‌స్ ఇవ్వలేదని సీతక్క విమర్శించారు. బోనస్‌‌‌‌‌‌‌‌పై మాట తప్పిన మీరు.. తమ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం విడ్డూరంగా ఉందన్నారు. బోనస్‌‌‌‌‌‌‌‌పై హరీశ్‌‌‌‌‌‌‌‌ రావు బోగస్ మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 10 నెల‌‌‌‌‌‌‌‌లుగా ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్ చేయ‌‌‌‌‌‌‌‌లేద‌‌‌‌‌‌‌‌ని విద్యార్థులపై కపట ప్రేమ చూపిస్తున్నారని విమర్శించారు.