మీ తండ్రి నేర్పిన సంస్కారం ఇదేనా.? వెంటనే క్షమాపణ చెప్పు:మంత్రి సీతక్క

మీ తండ్రి నేర్పిన సంస్కారం ఇదేనా.? వెంటనే క్షమాపణ చెప్పు:మంత్రి సీతక్క

తెలంగాణ మహిళల పట్ల అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి సీతక్క. ఆర్టీసీ బస్సుల్లో మహిళలు బ్రేక్ డాన్స్ లు, రికార్డింగ్ డాన్స్ లు చేసుకోవచ్చని కేటీఆర్ జుగుప్సకరంగా మాట్లాడారన్నారు. కేటీఆర్ తండ్రి ఆయనకు నేర్పిన సంస్కారం ఇదేనా అని ప్రశ్నించారు. మీ ఆడపడుచులు కూడా బ్రేక్ డాన్స్ లు చేస్తున్నారా? అని ప్రశ్నించారు. కేటీఆర్ కు ఆడవాళ్ళంటే గౌరవం లేదన్నారు. మహిళల పట్ల కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయన్నారు. వెంటనే...కేటీఆర్ తెలంగాణ మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రి సీతక్క.. 

బస్సుల్లో బ్రేక్ డ్యాన్సులో వేస్కోండి: కేటీఆర్

మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్  కాంట్రవర్సీ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఆర్టీసీ బస్సుల్లో మహిళలు అల్లం వెల్లుల్లి, కుట్లు అల్లికలు వేసుకుంటే తాము వద్దనట్లేదని.. అవసరమైతే బ్రేక్ డ్యాన్సులు, రికార్డు డ్యాన్సులు చేసుకోవచ్చన్నారు. బస్సుల్లో మహిళలు కొట్టుకుంటున్నారని.. డ్రైవర్లు, కండక్టర్లు కూడా కొట్టుకుంటున్నారని చెప్పారు. బస్సులు ఎక్కువ పెట్టండి.. అవసరమైతే ఒక్కో మహిళకు ఒక్కో బస్సు పెట్టండని మాట్లాడారు.