అర్హులకే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా : మంత్రి సీతక్క

అర్హులకే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా : మంత్రి సీతక్క
  • స్కీమ్‌‌‌‌పై కొంతమంది అపోహాలు సృష్టిస్తున్నరని ఫైర్

హైదరాబాద్, వెలుగు: భూమి లేని ఉపాధి కూలీల‌‌‌‌కు భ‌‌‌‌రోసా క‌‌‌‌ల్పించాలన్న ఉద్దేశంతో ఇందిర‌‌‌‌మ్మ ఆత్మీయ భ‌‌‌‌రోసా కింద ఆర్థిక సాయం చేయనున్నట్లు మంత్రి సీతక్క అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఉపాధి కూలీల‌‌‌‌కు రెండు విడతల్లో ఏడాదికి రూ.12 వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆత్మీయ భరోసా పథకంపై మాజీ మంత్రి హరీశ్‌‌‌‌రావు చేసిన వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఆదివారం ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసాపై  యావ‌‌‌‌త్ దేశం ఆస‌‌‌‌క్తి చూపుతోందని, అయితే, రాష్ట్రంలోని కొన్ని రాజ‌‌‌‌కీయ శ‌‌‌‌క్తులు ఈ ప‌‌‌‌థ‌‌‌‌కంపై అపోహ‌‌‌‌లు సృష్టించే ప్రయ‌‌‌‌త్నం చేస్తున్నాయని మండిపడ్డారు. 

ప‌‌‌‌దేండ్లు అధికారంలో ఉన్న కూలీల‌‌‌‌కు నయాపైసా ఇవ్వని గత బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ ప్రభుత్వం.. ఇప్పుడు వారిపై క‌‌‌‌ప‌‌‌‌ట ప్రేమ న‌‌‌‌టిస్తున్నదని విమర్శించారు. రూ.500 కోట్ల ఆస్తులున్న వారికీ రైతు బంధు ఇచ్చి రెక్కల కష్టం తప్ప ఎలాంటి ఆస్తి పాస్తులు లేని కూలీల‌‌‌‌ను గత సర్కార్‌‌‌‌‌‌‌‌ ప‌‌‌‌ట్టించుకోలేదన్నారు. ఇప్పుడు కూలీల‌‌‌‌కు ఆర్థిక చేయూత‌‌‌‌నందిస్తుంటే చూసి ఓర్వలేక అక్కసు వెల్లగ‌‌‌‌క్కుతున్నారని ఫైర్ అయ్యారు. 

కుటుంబం యూనిట్‌‌‌‌గా పథకాల అమలు..

ఆస‌‌‌‌రా పింఛన్‌‌‌‌తో స‌‌‌‌హా అన్ని ప్రభుత్వ సంక్షేమ ప‌‌‌‌థ‌‌‌‌కాలు కుటుంబం యూనిట్‌‌‌‌గా అమ‌‌‌‌ల‌‌‌‌వుతున్నాయని, ఇందిర‌‌‌‌మ్మ ఆత్మీయ భ‌‌‌‌రోసా ప‌‌‌‌థ‌‌‌‌కానికి కూడా అదే నిబంధ‌‌‌‌న వ‌‌‌‌ర్తిస్తుందని మంత్రి సీతక్క తెలిపారు. ఉపాధి పోర్టల్ అధికారిక లెక్కల ప్రకారం 2023-– 24 ఆర్థిక సంవ‌‌‌‌త్సరంలో రాష్ట్రవ్యాప్తంగా 48,13,966 జాబ్ కార్డులు క‌‌‌‌లిగిన కుటుంబాలు ఉన్నాయని, ఇందులో 22.64 ల‌‌‌‌క్షల కుటుంబాలు క‌‌‌‌నీసం ఒక్క రోజు కూడా ఉపాధి ప‌‌‌‌నుల్లో పాల్గొనలేదని చెప్పారు. 

కేవ‌‌‌‌లం జాబ్ కార్డు ఉన్నంత మాత్రాన ఉపాధి కూలీగా ప‌‌‌‌రిగ‌‌‌‌ణించ‌‌‌‌లేమని, కూలీ ద్వారా జీవ‌‌‌‌నోపాధి పొందితేనే ఉపాధి కూలీగా ప‌‌‌‌రిగ‌‌‌‌ణిస్తారని పేర్కొన్నారు. క‌‌‌‌నీసం ఒకరోజు ఉపాధి ప‌‌‌‌నుల్లో పాలుపంచుకున్న కుటుంబాలు 25.50 ల‌‌‌‌క్షల వ‌‌‌‌ర‌‌‌‌కు ఉన్నాయన్నారు. అయితే, కనీసం 20 రోజుల పాటు ఉపాధి కూలీగా ప‌‌‌‌ని చేసిన‌‌‌‌ కుటుంబాలనే ఉపాధి హామీ ఆధారిత‌‌‌‌ కుటుంబాలుగా ప‌‌‌‌రిగ‌‌‌‌ణిస్తామని, అలాంటి ఫ్యామిలీలు రాష్ట్రంలో 17.26 ల‌‌‌‌క్షల వ‌‌‌‌ర‌‌‌‌కు ఉన్నాయని తెలిపారు. ఇందులో 11 ల‌‌‌‌క్షలకు పైగా కుటుంబాల‌‌‌‌కు సొంత భూమి ఉండ‌‌‌‌టంతో రైతు భ‌‌‌‌రోసా ల‌‌‌‌బ్ధిదారులుగా ఉన్నారన్నారు. దీంతో 6 ల‌‌‌‌క్షల‌‌‌‌కు పైగా ఉపాధి కూలీ కుటుంబాలకు ఎలాంటి భూమి లేదని, వీరికి ఇందిర‌‌‌‌మ్మ ఆత్మీయ భ‌‌‌‌రోసా ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.