మూసీపై చిల్లర రాజ‌‌‌‌‌‌‌‌కీయాలు చేస్తే ప్రజలే బుద్ధి చెప్తరు : సీతక్క

మూసీపై చిల్లర రాజ‌‌‌‌‌‌‌‌కీయాలు చేస్తే ప్రజలే బుద్ధి చెప్తరు : సీతక్క
  • ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కేటీఆర్​పై మంత్రి సీతక్క ఫైర్

హైదరాబాద్, వెలుగు: మూసీ పున‌‌‌‌‌‌‌‌రుజ్జీవంపై కేటీఆర్ చేస్తున్న ఆరోప‌‌‌‌‌‌‌‌ణ‌‌‌‌‌‌‌‌ల్లో ప‌‌‌‌‌‌‌‌సలేద‌‌‌‌‌‌‌‌ని మంత్రి సీత‌‌‌‌‌‌‌‌క్క శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మూసీ పున‌‌‌‌‌‌‌‌రుజ్జీవం ప్రాజెక్టును మొద‌‌‌‌‌‌‌‌ట్లో వ్యతిరేకించిన కేటీఆర్.. ఇప్పుడు ప్రజాగ్రహానికి త‌‌‌‌‌‌‌‌లొగ్గి తాము వ్యతిరేకం కాదంటూ స‌‌‌‌‌‌‌‌న్నాయి నొక్కులు నొక్కుతున్నార‌‌‌‌‌‌‌‌ని ఎద్దేవా చేశారు. మూసీ డీపీఆర్ ఎప్పుడో సిద్ధం చేశామ‌‌‌‌‌‌‌‌ని చెబుతున్న ఆయన.. ప‌‌‌‌‌‌‌‌దేండ్లుగా అధికారంలో ఉండి ఎందుకు మూసీని శుద్ధి చేయ‌‌‌‌‌‌‌‌లేక‌‌‌‌‌‌‌‌పోయార‌‌‌‌‌‌‌‌న్నారు. ఎలాంటి డీపీఆర్ లేకుండానే కాళేశ్వరం పేరుతో రూ.ల‌‌‌‌‌‌‌‌క్ష కోట్లను గోదారి పాలు చేసిన బీఆర్ఎస్ నేత‌‌‌‌‌‌‌‌ల‌‌‌‌‌‌‌‌కు, డీపీఆర్ గురించి మాట్లాడే క‌‌‌‌‌‌‌‌నీస అర్హత లేద‌‌‌‌‌‌‌‌న్నారు.

 తామే మూసీ ప్రక్షాళనను మొద‌‌‌‌‌‌‌‌లు పెట్టామ‌‌‌‌‌‌‌‌ని ఓ వైపు గొప్పగా చెబుతూనే మ‌‌‌‌‌‌‌‌రో వైపు మూసీ పున‌‌‌‌‌‌‌‌రుజ్జీవం ప్రాజెక్టును ఎందుకు వ్యతిరేకించాల్సి వస్తుందో చెప్పాల‌‌‌‌‌‌‌‌ని డిమాండ్ చేశారు. ఒకప్పుడు నాంపల్లి, ఖైరతాబాద్ మండలాలకే పరిమితమైన హైదరాబాద్ నగరాన్ని నలుదిక్కులా విస్తరించి విశ్వనగరంగా మార్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు. మూసీ విషయంలో స‌‌‌‌‌‌‌‌ల‌‌‌‌‌‌‌‌హాలు, సూచ‌‌‌‌‌‌‌‌న‌‌‌‌‌‌‌‌లు ఇస్తే స్వీక‌‌‌‌‌‌‌‌రిస్తామ‌‌‌‌‌‌‌‌ని, త‌‌‌‌‌‌‌‌ప్పుడు ఆరోప‌‌‌‌‌‌‌‌ణ‌‌‌‌‌‌‌‌లు, చిల్లర, మల్లర రాజ‌‌‌‌‌‌‌‌కీయాలు చేస్తే ప్రజలే బుద్ధి చెబుతార‌‌‌‌‌‌‌‌ని మంత్రి సీత‌‌‌‌‌‌‌‌క్క హెచ్చరించారు. హైద‌‌‌‌‌‌‌‌రాబాద్​కు పురుడు పోసిన మూసీని కాపాడుకునేందుకు ప్రజా ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదన్నారు. ప్రజా ప్రభుత్వంపై నమ్మకంతో మూసీ ప‌‌‌‌‌‌‌‌రీవాహక ప్రాంత ప్రజలు ఇష్టపూర్తిగా ఇండ్లు ఖాళీ చేసి వెళ్తుంటే.. కేటీఆర్ తట్టుకోలేక లేనిపోని ఆరోప‌‌‌‌‌‌‌‌ణ‌‌‌‌‌‌‌‌లు చేస్తున్నార‌‌‌‌‌‌‌‌ని సీత‌‌‌‌‌‌‌‌క్క మండిప‌‌‌‌‌‌‌‌డ్డారు.