తెలంగాణలో తొలి కంటెయినర్ స్కూల్..ఎక్కడో తెలుసా.?

తెలంగాణలో  తొలి కంటెయినర్ స్కూల్..ఎక్కడో తెలుసా.?

తెలంగాణలో  తొలి కంటెయినర్ స్కూల్ అందుబాటులోకి రానుంది.  మలుగు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో ప్రభుత్వ స్కూల్‌ను కంటెయినర్‌లో ఏర్పాటు చేశారు. ఈ స్కూల్ ను  మంత్రి  సీతక్క సెప్టెంబర్ 17న  ప్రారంభించ‌నున్నారు. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని కాంతనపల్లి అటవీ ప్రాంతంలో బంగారుపల్లి ఆవాస గ్రామం ఉంది. ప్రస్తుతం గుడిసెలో న‌డుస్తున్న పాఠ‌శాల శిధిలావస్థకు చేరుకుంది. అట‌వి ప్రాంతం కావ‌డంతో కొత్త పాఠశాల భవన నిర్మాణానికి అటవీ అధికారులు అనుమతులివ్వలేదు. దీంతో ఇక్కడ కంటెయిన‌ర్ పాఠ‌శాల ఏర్పాటు చేశారు సీతక్క. 

ములుగు నియోజ‌క‌వ‌ర్గంలోని తాడ్వాయ్ మండ‌లంలో కంటెయిన‌ర్ ఆసుప‌త్రిని మంత్రి సీత‌క్క అందుబాటులోకి తేవ‌డంతో స్థానిక ప్రజలకు  వైద్య సేవ‌లు అందుతున్నాయి. అదే కోవ‌లో ఇప్పుడు కంటేయిన‌ర్ పాఠ‌శాల‌ను ప్రారంభించబోతున్నారు.  ఈ కంటెయినర్ స్కూ్ల్ 25 అడుగుల వెడల్పు, 25 అడుగుల పొడవు ఉంటుంది. ఇందులో ఇద్దరు టీచ‌ర్లు ప‌నిచేస్తుండ‌గా..వారితో పాటు విద్యార్ధులు సౌకర్య వంతంగా కూర్చునే విధంగా కంటేయిన‌ర్  స్కూల్ ను ఏర్పాటు చేశారు.