కేసీఆర్కు మంత్రి సీతక్క లీగల్ నోటీసులు

కేసీఆర్కు మంత్రి సీతక్క లీగల్ నోటీసులు

తన ప్రతిష్ఠకు భంగం కలిగించేలా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తుందని ఆరోపిస్తూ మంత్రి సీతక్క లీగల్ నోటీసులు పంపారు. ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ సహా... బీఆర్ఎస్ పార్టీకి లీగల్ నోటీసులు జారీ చేశారు.

 ఇందిరమ్మ రాజ్యంలో ఇసుకాసుర రాజ్యం అంటూ  సీతక్కపై గత కొంతకాలంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు.  జూన్ 24న  బీఆర్ఎస్ అధికారిక సోషల్ మీడియా పేజీలో ఈ పోస్టులు పెట్టారని తనపై నిరాధారమైన ఆరోపణలు చేశారని సీతక్క మండిపడ్డారు. జూలై 5న  కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీకి నోటీసులు పంపారు. తన ప్రతిష్టకు భంగం కలిగించిన వాళ్లు...లిఖితపూర్వకంగా క్షమాపణలు చెప్పాలని కోరారు.