మేడారంలో కమాండ్ కంట్రోల్ రూమ్ ప్రారంభించిన మంత్రి సీతక్క

ములుగు జిల్లా మేడారంలో నిర్మించిన పోలీసు కమాండ్ కంట్రోల్‌ రూమ్‌ ను మంత్రి సీతక్క ప్రారంభించారు. మేడారంలో రూ.90 లక్షలతో పోలీస్ కమాండ్‌ కంట్రోల్‌ నిర్మాణం చేపట్టారు. సమ్మక్క-సారలమ్మ ఆలయం దగ్గర ఈ నిర్మాణాన్ని చేపట్టారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సీతక్క తొలిసారిగా ఆదివారం(డిసెంబర్ 17) ములుగు జిల్లాకు వెళ్లారు. ఈ సందర్భంగా మొహమ్మద్ గౌస్‌పల్లి దగ్గర ఆమెకు కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు.

కాగా మేడారం మహా జాతర దగ్గర పడుతున్న సమయంలో రాష్ట్ర నలుమూలల నుంచి మేడారం సందర్శనకు ప్రయాణికుల రద్దీ పెరుగుతోంది. కాబట్టి భక్తుల సౌకర్యం హనుమకొండ బస్‌స్టేషన్‌ నుంచి మేడారం జాతరకు ఆర్టీసీ అధికారులు ఈరోజు(డిసెంబర్ 17) నుంచి ప్రత్యేక బస్సులను ప్రారంభించారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ప్రతీ బుధవారం, ఆదివారం, ఇతర సెలవు రోజుల్లో బస్సులు నడుస్తాయని.. ఈ సౌకర్యాన్ని ప్రయాణికులు వినియోగించుకోవాలని ఆర్టీసీ అధికారులు సూచించారు.