అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు ఫ్రీగా క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు: మంత్రి సీతక్క

అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు ఫ్రీగా  క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు: మంత్రి సీతక్క

ములుగు జిల్లాలో మహిళా సంఘాలు, ఆశా వర్కర్లతో పాటూ ప్రజలకు క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు ఏర్పాటు చేస్తామన్నారు మంత్రి సీతక్క. ఏటూరు నాగారంలోని గిరిజన భవనంలో మహిళా అభివృద్ధి,  శిశు సంక్షేమ శాఖ మరియు గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు ఉచిత  క్యాన్సర్ నిర్ధారణ పరీక్ష శిబిరాన్ని ఏర్పాటు చేశారు. 

ఈ కార్యక్రమాన్నిఎమ్మెల్యే తెల్లంవెంకట్రావు, కలెక్టర్ దివాకర్, గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ప్రతినిధులతో కలసి ప్రారంభించారు మంత్రి సీతక్క. ప్రపంచాన్ని వణికించే క్యాన్సర్ ను అరికట్టడంలో భాగంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. అడిగిన వెంటనే స్పందించి గ్రేస్ ఫౌండేషన్ నిర్వాహకులు ఈ క్యాంపును ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు మంత్రి.