మహిళలకు వడ్డీ లేని రుణాలతో పాటు 10 లక్షల జీవిత భీమా అందిస్తామన్నారు మంత్రి సీతక్క. మహిళలను కోటీశ్వరులను చేయాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ములుగు జిల్లా కన్నాయి గూడెం మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు సీతక్క. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె.. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని కోరారు. రాష్ట్రంలో మాదిరిగానే కేంద్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెప్పారు.
2022 వరకు దేశంలో ఉన్న పేదలందరికీ ఇల్లు కట్టిస్తామని బీజేపీ గత ఎన్నికల్లో మాట ఇచ్చి తప్పిందన్నారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ఎక్కడ ఇల్లు కట్టించారో బీజేపీ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ ,బీఆర్ఎస్ లకు ఓటు అడిగే హక్కు లేదన్నారు సీతక్క. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఐదు గ్యారంటీలు అమలు చేశామన్నారు. బీఆర్ఎస్ 10 ఏండ్ల పాలనలో రాష్ట్రాన్ని లూటీ చేసిందని ఆరోపించారు.మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి బలరాం నాయక్ ను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు.