ములుగు పంచాయతీని మున్సిపాలిటీగా మార్చే బిల్లుకు ఆమోదం తెలపాలంటూ మంత్రి సీతక్క గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను కోరారు. ఇవాళ ఉదయం రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిసి విజ్ఞప్తి చేశారు . అనంతరం మీడియాతో మాట్లాడిన సీతక్క. ములుగు గ్రామ పంచాయతీని మున్సిపాలిటీగా మారుస్తూ 2022లో నాటి ప్రభుత్వం అసెంబ్లీ బిల్ పెట్టిందని.. అది గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉందన్నారు.
Also Read :- కేంద్రమంత్రి గడ్కరీని కలిసిన స్పీకర్, ఎంపీ వంశీకృష్ణ
పెండింగ్ లో ఉన్న బిల్లుకు ఆమోద ముద్ర వేయాలని గవర్నర్ ను కోరినట్లు చెప్పారు సీతక్క. గవర్నర్ దీనికి సానుకూలంగా స్పందించారని చెప్పారు. ఆదిలాబాద్, నాగర్ కర్నూల్ జిల్లాల పర్యటనకు రావడానికి గవర్నర్ సిద్ధంగా ఉన్నారని చెప్పారు సీతక్క. ములుగు జిల్లా నుంచి కొన్ని గ్రామాలను గవర్నర్ దత్తత తీసుకునే ఆలోచనలో ఉన్నారని తెలిపారు.