తెలంగాణలోని అంగన్ వాడీలకు కేంద్ర వాటా నిధులు పెంచాలని కేంద్రమంత్రి అన్నపూర్ణ దేవిని కోరారు మంత్రి సీతక్క. ఫిబ్రవరి 3న ఢిల్లీలో కేంద్రమంత్రి అన్నపూర్ణ దేని కలిసి ఈ మేరకు రిక్వెస్ట్ చేశారు. సీతక్క వెంట తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ ఫహీమ్ ఉన్నారు. ఈ సందర్బంగా చిన్న పిల్లలు, బాలింతలు, గర్భిణీలకు పౌష్టికాహారం కోసం అమలు చేస్తున్న స్కీమ్ లకు రాష్ట్రానికి ఎక్కువ నిధులను కేటాయించాలని విజ్ఞప్తి చేశారు సీతక్క.
ALSO READ | కేసీఆర్ కు లీగల్ నోటీస్
ప్రస్తుతం తెలంగాణలో అమలుచేస్తున్న స్కీమ్ ల వివరాలు, ఖర్చు చేస్తున్న బడ్జెట్, ఇందులో కేంద్రం వాటాపై కేంద్ర మంత్రికి వివరించారు. అంగన్ వాడీ కేంద్రాల్లో చిన్నారులకు మరిన్ని పోషకాలతో కూడిన బలవర్దకమైన ఆహారాన్ని అందించేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రం ఇచ్చే నిధులలో వాటా పెంచితే చిన్న పిల్లలు, బాలింతలు, గర్భిణీలకు మరిన్ని స్కీమ్ లు అమలు చేయొచ్చని సీతక్క కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. బాలామృతం, బాలామృతం ప్లస్, ఐసిడీఎస్ ద్వారా అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేసే విధానాన్ని కేంద్ర మంత్రికి వివరించారు సీతక్క.