పోలీస్ జాబ్ అంటే రెస్పెక్ట్..రెస్పాన్సిబిలిటీ అని అన్నారు మంత్రి సీతక్క. వరంగల్ మామూనూరు పోలీస్ శిక్షణా కేంద్రంలో 1148 మంది మహిళ పోలీస్ కానిస్టేబుల్స్ శిక్షణ పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించారు కానిస్టేబుళ్లు. ఈ సందర్బంగా మాట్లాడిన సీతక్క. అధికారం వచ్చినా10 నెలల్లో నియామక పత్రాలు ఇచ్చిన ఘనత రేవంత్ రెడ్డికి దక్కుతుందన్నారు. మహిళా కానిస్టేబుళ్లు ఎంత కఠోర దీక్షతో ట్రెయింగ్ తీసుకున్నారని చెప్పారు. ప్రజలు శాంతియుతంగా బ్రతకాలంటే పోలీస్ వ్యవస్థ ముఖ్యమన్నారు సీతక్క.
ఓరుగల్లు గడ్డ రుద్రమ్మ పౌరుషాన్ని చూసిన నేల ఇది. సమ్మక్క సారక్క వీరోచిత పోరాటాన్ని చూసిన నేల ఓరుగల్లు నేల. మీ లక్ష్యాన్ని సమాజం కోసం వినియోగించాలి. మహిళా పోలీసులు అద్భుతంగా రాణించాలి. సమస్యలకి విన్నూత సొల్యూషన్లను చూపుతూ అధ్బుతంగా రాణించాలి . మిమ్మల్ని కూడా రుద్రమ్మ లాగా సమాజం గుర్తు పెట్టుకోవాలి. ఇచ్చిన మాట ప్రకారం ఎన్ని కేసులున్నా సాల్వ్ చేసి నియామక పత్రాలు ఇచ్చాం. సమాజాన్ని రక్షించే మంత్ర దండంలా పని చెయ్యాలని సీతక్క సూచించారు.