- ఫిర్యాదులకు 14567 టోల్ ఫ్రీ నంబర్
- దేశంలోనే మొదటి సారిగా ఏర్పాటు
- కేంద్రం పదేండ్ల నుంచి రూ. 200 ఇస్తోంది : మంత్రి సీతక్క
హైదరాబాద్: వయోవృద్ధుల కోసం ఆన్ లైన్ ఫిర్యాదు విధానాన్ని ప్రవేశ పెట్టిన మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ అని మంత్రి సీతక్క అన్నారు. వయోవృద్ధుల సంక్షేమ బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. వయోవృద్ధుల ఫిర్యాదు నమోదు కోసం రూపొందించిన యాప్ ను ఇవాళ రవీంద్ర భారతిలో జరిగిన అంతర్జాతీయ వయోవృద్దుల దినోత్సవంలో ఆమె ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన సీతక్క .. పిల్లల ప్రేమకు నోచుకోని తల్లిదండ్రులకు తిరిగి ఆస్తిని అప్పగించే చర్యలు చేపడుతామన్నారు. వృద్యాప్య పించన్ల మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం పెంచాలని డిమాండ్ చేశారు. పెద్దల కష్టాలు కన్నీళ్లు పంచుకోవడానికి ఒక రోజు వుండాలని ఐక్య రాజ్య సమితి వయోవృద్ధుల దినోత్సవాన్ని ప్రకటించిందని గుర్తు చేసారు. మారిన పరిస్థి తుల్లో వయసు పెరుగుతుంటే ఆందోళన కలుగుతుందన్నారు. వయోవృద్ధుల కోసం ఉచిత టోల్ ఫ్రీ నెం. 14567 సేవలను మరింత పటిష్ట పరుస్తామన్నారు. వయోవృద్ధుల హక్కులు, అధికారాల పట్ల అవగాహన పెంచేందుకు కలెక్టరేట్లలో బోర్డులను ఏర్పాటు చేస్తామన్నారు.
ALSO READ | మూసీ మురికి నల్గొండ ప్రజలకు శాపం: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
పిల్లలు సరిగా చూసుకోకపోతే ఆస్తిని తిరిగి పొందే హక్కు వృద్ధులకు ఉందన్నారు మం త్రి సీతక్క. పిల్లల ప్రేమకు నోచుకోని తల్లిదండ్రులకు తిరిగి ఆస్తిని అప్పగిస్తామని హెచ్చరించారు. తల్లిదండ్రులు లేకపోతే మన ఉనికే లేదని అందరూ గుర్తించాలన్నారు. ఆస్తులు అంతస్తు లు ముఖ్యం కాదని.. బంధాలు అనుబంధాలే ముఖ్యమని.. అవే మనకు ఓదార్పునిస్తాయని మంత్రి సీతక్క పేర్కొన్నారు. వయోవృద్ధులకు కేంద్ర ప్రభుత్వం కేవలం రూ. 200 నెలవారి పెన్షన్ ఇస్తుందని... ధరలు పెరిగినా గత పదేండ్లుగా ఒక్క రూపాయి పెంచలేదని అన్నారు. కేంద్రం పెన్షన్ మొత్తాలను పెంచాలని, లబ్ధిదారుల సంఖ్యను పెంచాలని సీతక్క డిమాండ్ చేశారు.