రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో సుమారు 35 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు మంత్రి సీతక్క.ఈ క్రమంలో మహిళా సంఘాలకు 80 కోట్ల రూపాయల చెక్కులను అందజేసిన సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక మహిళలను ఆర్ధికంగా బలోపేతం చేయాలని కృషి చేస్తున్నారని.. రాజశేఖర్ రెడ్డి తర్వాత మహిళల అభ్యున్నతికి ఆలోచిస్తున్న ఘనత మన సీఎం రేవంత్దే అని అన్నారు.
మహిళా సంఘాలకు 19 రకాల వ్యాపారాలు పెట్టామని... మహిళలు ఎదుగుతుంటే బీఆర్ఎస్ నాయకులు కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నారన్నారని మండిపడ్డారు. ఒక్క చీర ఇచ్చి వందల సార్లు చెప్పుకున్న ఘనత బీఆర్ఎస్ పార్టీదని అన్నారు. రైతులకు 21 వేల కోట్లు రుణ మాఫీ చేశామని... సన్న వడ్లకు 500 బోనస్ ఇస్తున్నామన్నారు సీతక్క.
Also Read : ప్రతి గ్రామ పంచాయతీకి బీటీ రోడ్డు
కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని...గత ప్రభుత్వం లో గుట్టలకు, రోడ్లకు రైతు బందు ఇచ్చారని అన్నారు. ప్రభుత్వం పై 24 వేల కోట్లు భారం పడిందన్నారు సీతక్క. మహిళలు తలుచుకుంటే ఇంటినే కాదు, సమాజాన్ని, దేశాన్ని సైతం ఏలగలరన్నారు మంత్రి సీతక్క.