నేడు ఉట్నూరుకు మంత్రి సీతక్క

ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ కేబీ కాంప్లెక్స్ లో  పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించేందుకు శనివారం మంత్రి సీతక్క హాజరుకానున్నారు. శుక్రవారం కలెక్టర్ రాజర్షి షా, జిల్లా ఎస్పీ గౌస్ ఆలం, ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా లతో కలసి ఉట్నూర్ కేబీ కాంప్లెక్స్ లోని ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో మంత్రి పాల్గొనే వివిధ ప్రాంతాలను, వాటి ఏర్పాట్లను పరిశీలించారు.