ములుగు అడవుల్లో సుడిగాలి బీభత్సం వల్ల లక్ష చెట్ల వరకు నెలకొరిగాయన్నారు మంత్రి సీతక్క. వందల ఎకరాల్లో నష్టం వాటిల్లిందన్నారు. వృక్షాలు కూలడంపై విచారణకు ఆదేశించామని చెప్పారు. డ్రోన్ కెమెరాల సహాయంతో జరిగిన నష్టాన్ని అంచనా వేయాలని ఆదేశించారు సీతక్క. ఘటన ప్రాంతాన్ని సందర్శించి పీసీసీఎఫ్ నివేదిక సిద్ధం చేస్తుందని వెల్లడించారు. అడవిలో సుడిగాలి వచ్చింది కాబట్టి ప్రాణనష్టం జరగలేదు..అదే సుడిగాలి గ్రామాల్లోకి వచ్చి ఉంటే పెను విధ్వంసం జరిగేదన్నారు.
ALSO READ | మేడారంలో సుడిగాలి బీభత్సం... 50వేలకు పైగా చెట్లు నేలమట్టం
సమక్క సారలమ్మ తల్లుల దయ వల్లే సుడిగాలి ఊర్ల మీదకు రాలేదన్నారు సీతక్క. తల్లుల దీవేనతోనే ప్రజలు సురక్షితంగా బయటపడగలిగారని తెలిపారు. చెట్లు నెలకూలడంపై కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. కేంద్రం నుంచి పరిశోధన జరిపి కారణాలు గుర్తించి..ఆదుకోవాలన్నారు. అటవి ప్రాంతంలో చెట్లను పెంచేలా ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.